మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి విద్యుత్ షాక్ తగిలి తండ్రీకూతురు మృతి చెందారు. తండ్రి సందీప్, కూతురు రితికలు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందగా.. సందీప్ భార్య శ్వేతకు స్వల్ప గాయాలయ్యాయి,. భారీ వర్షం కారణంగా చెట్టు విరిగి ఇంటి ఎదుట ఉన్న వారి కారుపై పడింది. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే క్రమంలో విద్యుత్తు తీగలకు తగిలి షాక్‌తో సందీప్, రితికలు అక్కడికక్కడే మృతి చెందారు. రితిక ఇంటర్ చదువుతోంది. తండ్రీ కూతురు మృతితో టెలికాం కాలనీ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తో తండ్రీ కూతురు మృతి
0
47
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


