డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన లేట్ అయ్యింది. అయితే.. లేట్ అయినా లేటస్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు పూరి. ఈ సందర్భంగా స్లమ్ డాగ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో స్లమ్ డాగ్ మూవీ సక్సెస్ పూరికి చాలా కీలకం. మరి.. స్లమ్ డాగ్ టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి..? స్లమ్ డాగ్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు.. వరుసగా ప్లాపు అవ్వడం.. తెలుగులో సినిమా చేద్దామని ట్రై చేస్తే.. ఏ హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి స్లమ్ డాగ్ అనే మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ కే కంప్లీట్ అయ్యింది. అయితే… లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ కి బాకీ ఉండడంతో ఆ ఎఫెక్ట్ స్లమ్ డాగ్ పై పడింది. అందుకే ఇంత లేట్ అయ్యిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఇక స్లమ్ డాగ్ టీజర్ విషయానికి వస్తే.. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్లకింద దాక్కునే జీవితాలు మావి. అలాంటిది మా బతుకులతో ఆడుకొంటే నేనెందుకు వదులుతా అనే విజయ్ సేతుపతి డైలాగుతో టీజర్ స్టార్ట్ అయ్యింది.
టీజర్ అంతా యాక్షన్ మోడ్ లోనే ఉంది. ఎవరికీ అక్కర్లేని, ఎవరికీ ఏం కాని.. స్లమ్ డాగ్, వ్యవస్థ పై, విధానాలపై, పీక్కుతింటున్న మనుషుల పై ఎలా తిరగబడ్డాడో ఈ సినిమాలో చూపించబోతున్నాడు పూరి. ఈ టీజర్ లో చెప్పడానికి పెద్దగా ఏం లేదు. కాకపోతే.. పూరి రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉందని.. బలమైన కంటెంట్తోనే ఈ సినిమా తీసారని మాత్రం అర్థమౌతుంది. ఈ టీజర్ కు హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన థీమ్ సాంగ్ బాగా సెట్ అయ్యింది. విజయ్ సేతుపతి సినిమాల్లో ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పచ్చు. టబుని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించారు. తన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపించింది.
చాలా స్పీడుగా సినిమాలు తీసే.. పూరి ఈ సినిమా కోసం రూటు మార్చారు. కథ పై బాగా కసరత్తు చేశారు. స్పీడుగా తీయడం కంటే.. క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈసారి పక్కాగా హిట్ కొడుతున్నామని పూరి బలంగా నమ్ముతున్నారు. అయితే.. ఈ మూవీ రిలీజ్ డేట్ టీజర్ లో మెన్షన్ చేయలేదు. మరి.. స్లమ్ డాగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అంటే.. జులై లేదా ఆగస్టుల్లో ఉంటుందని టాక్ఈ వినిపిస్తోంది. మరి.. పూరి నమ్మకం ఎంత వరుకు నిజమౌతుందో చూడాలి.


