పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరం కలిసి కృషి చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై ప్రయాణించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి, మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరం కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


