ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఆఫీసర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అదనపు ఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావును గతంలోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన నివాసాలు.. బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది.
అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఏసీబీ సోదాలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఆయనకు చెందిన 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు
Latest Articles
- Advertisement -


