త్రివిక్రమ్ టార్గెట్ ఫిక్స్ చేసిన వెంకీ..?

వెంకీ.. పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ.. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ సాధిస్తూ.. కెరీర్లో దూసుకెళుతున్నారు. ప్రెజెంట్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో.. ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తూ.. మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఈ మూవీ ఇప్పటికే కంప్లీట్ కావాలి కానీ.. కాలేదు. దీంతో సమ్మర్ కి రావాల్సిన ఆదర్శ కుటుంబం పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. వెంకీ.. త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. వెంకీ ఫిక్స్ చేసిన టార్గెట్ ఏంటి..? నెక్ట్స్ మూవీ అప్ డేట్ ఏంటి..?

విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఫస్ట్ టైమ్ సినిమా రూపొందుతుండడం.. పైగా సంక్రాంతికి వస్తున్నాం అనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత వెంకీ నుంచి రానున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేసి సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో.. పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ కంప్లీట్ చేసి.. వెంకీ.. అనిల్ రావిపూడితో సినిమాని పట్టాలెక్కించాలి అనుకున్నారు. కానీ.. ప్లాన్ రివర్స్ అవ్వడంతో అనిల్ తో సినిమా ఇంత వరుకు స్టార్ట్ కాలేదు.

ఇలా ఆదర్శ కుటుండం సినిమా షూటింగ్ లేట్ అవుతుండడంతో.. త్రివిక్రమ్ కి వెంకీ.. టార్గెట్ ఫిక్స్ చేసారని తెలిసింది. నెక్ట్స్ మంత్ ఎండింగ్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని.. త్రివిక్రమ్ కి వెంకీ టార్గెట్ పెట్టారట. దీంతో ఆదర్శ కుటుంబం షూటింగ్ స్పీడు అందుకుందని.. నెక్ట్స్ మంత్ కి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసారని తెలిసింది. ఇక వెంకీ, అనిల్ రావిపూడి మూవీ అప్ డేట్ ఏంటంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వెంకీ ఎప్పుడు ఓకే అంటే.. అప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి అనిల్ తన టీమ్ తో రెడీగా ఉన్నారట.

సమ్మర్లో రిలీజ్ చేయాల్సిన ఆదర్శ కుటుంబం సినిమాని దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకీ నెక్ట్స్ మూవీని జులైలో షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ కి పూర్తి చేయాలి.. సంక్రాంతికి భారీగా రిలీజ్ చేయాలనేది ప్లాన్. వెంకీ, నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పై మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది. వెంకీకి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంటే.. కళ్యాణ్ రామ్ కి జంటగా కృతి శెట్టి నటిస్తుంది. మరి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన వెంకీ.. త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం, అనిల్ రావిపూడితో చేసే సినిమాలతో మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్