పెద్ది మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం అయితే.. తెర వెనుక చాలా చర్చ జరిగింది. బాలీవుడ్ బ్యూటీస్ తో ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ప్రచారం జరిగినా.. ఆఖరికి శృతి హాసన్ తో ఈ స్పెషల్ సాంగ్ తీసారు. ఈ పాటలో జాన్వీ కపూర్ కూడా ఉండడం విశేషం. ఇలా పెద్ది స్పెషల్ సాంగ్ ని స్పెషల్ గా డిజైన్ చేశాడు బుచ్చిబాబు. అయితే.. ఈ పాట జిగేల్ రాణి రేంజ్ లో ఉంటుందని.. ప్రచారం జరిగింది. మరి.. హెల్లల్లాలో హల్లో అంటూ వచ్చిన ఈ సాంగ్ మరో జిగేల్ రాణి అయ్యేనా..? లేదా..? ఎలా ఉంది ఈ స్పెషల్ సాంగ్ తెలుకుందాం రండి..
పెద్ది నుంచి రిలీజ్ చేసిన పాటల్లో ఇప్పటి వరుకు రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. చికిరి చికిరి పాన్ ఇండియా స్థాయిలో రీచ్ అయ్యింది. ఇక రైరైరా రయ్ సాంగ్ లో ఈ పాట కన్నా చరణ్ స్టెప్పులు హైలెట్ అయ్యాయి. అందుకనే ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. భోపాల్ ఈవెంట్ లో స్పెషల్ సాంగ్ లాంచ్ చేసారు. ఆతర్వాత ఆన్ లైన్ లో స్పెషల్ సాంగ్ వీడియో రూపంలో విడుదల చేశారు. రామ్ చరణ్, శృతి హాసన్ జంటతో మొదలైన పాట సగమయ్యాక జాన్వీ కపూర్ తోడవ్వడంతో కొత్త ఫ్లేవర్ అందుకుంది.
అయితే.. గత రెండు పాటలు చూశాక ఇది ఆశించిన రేంజ్లో లేదనే టాక్ వచ్చింది. స్క్రీన్ మీద ఫుల్ సాంగ్ చూస్తూ ముగ్గురి స్టెప్పులను ఎంజాయ్ చేస్తే కలిగే మాస్ ఫీలింగ్ వేరే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. అప్పట్లో రంగస్థలం నుంచి జిగేలు రాణి పాట రిలీజ్ కాగానే బాగానే ఉందని అనిపించింది. అయితే.. మూవీ రిలీజ్ తర్వాత ఆ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. ఈ.. హల్లల్లాలో హల్లో స్పెషల్ సాంగ్ కూడా జిగిల్ రాణి వలే.. రిలీజ్ తర్వాత మరింతగా పాపులర్ అవుతుందని.. టాక్. చూడాలి మరి.. ఈ సాంగ్ యూట్యూబ్ ని ఎంత వరుకు షేక్ చేస్తుందో..


