మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య … అప్పుల వివాదమే కారణమా?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.

పోలీసుల సమాచారం ప్రకారం, మృతులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలుగా గుర్తించారు. ఇటీవల తాండూరులో మిస్సింగ్ అయిన ఈ ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆనవాళ్లు కనిపించకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళల నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుల వ్యవహారంలో తలెత్తిన వివాదాలే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఘటనకు సంబంధించి పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్