టిమ్స్‌ ఆసుపత్రులను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి: కేటీఆర్‌

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (K. T. Rama Rao) రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న టిమ్స్‌ ఆసుపత్రుల పనులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించిన ఆయన అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని( Talasani Srinivas Yadav)తో పాటు భారత రాష్ట్ర సమితి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌( K. Chandrashekar Rao) విజన్‌తో టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో ఒక్కో టిమ్స్‌ ఆసుపత్రిని సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు నాలుగు వైపులా ఈ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్టులు రెండేళ్ల క్రితమే పూర్తయ్యేవని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే భావనతో పనులు ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని సూచించారు.

సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్‌బీనగర్‌, గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రులతో పాటు ఎంజీఎం వరంగల్‌, నిమ్స్‌ విస్తరణ పనులను కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్