37.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

కాంచన 4 కు కష్టాలా..?

హర్రర్ జోనర్ కు కమర్షియల్ రేంజ్ తీసుకొచ్చింది ఎవరంటే.. రాఘవ లారెన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లారెన్స్ తెరకెక్కించిన ముని ఎందరికో ఇన్ స్పిరేషన్ ఇచ్చింది. ఆతర్వాత కాంచన, గంగ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించారు. కాంచన 3 మూవీ రొటీన్ గా ఉన్నప్పటికీ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే.. ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాంచన 4 అంటూ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు లారెన్స్. అయితే.. ఈ మూవీ అనౌన్స్ చేసి చాన్నాళ్లు అవుతున్నా.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఆఖరికి కాంచన 4కు కూడా కష్టాలు తప్పలేదని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. లేటెస్ట్ కాంచనకు వచ్చిన కష్టాలు ఏంటి..?

రాఘవ లారెన్స్.. హర్రర్ సినిమాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. ముని సినిమా మాస్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇక అక్కడ నుంచి లారెన్స్ సీక్వెల్స్ తీయడం స్టార్ట్ చేశారు. కాంచన, కాంచన 2, కాంచన 3 అంటూ ఓ వైపు భయపెడుతూ.. మరో వైపు నవ్విస్తూ.. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. అందుకనే.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ సాధించాయి. దీంతో కాంచన 4 అనౌన్స్ చేసినప్పటి నుంచి మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. కాంచన 4 ఈపాటికే రిలీజ్ కావాలి కానీ.. కొన్ని ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో లారెన్స్ రీ షూట్ చేస్తున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. స్క్రిప్ట్ విషయంలో చాన్నాళ్లు కసరత్తు చేసి లాక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మళ్లీ కథ పై కసరత్తు చేశారని సమాచారం. ఇలా పర్ ఫెక్షన్ విషయంలో కాంప్రమైజ్ అనేదే లేకుండా లారెన్స్ పదే పదే బెస్ట్ కోసం తపిస్తున్నాడని అంటున్నారు. ఇందులో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డేని దెయ్యం క్యారెక్టర్ కి ఎంచుకుని లారెన్స్ రిస్క్ చేస్తున్నాడు అంటున్నారు సినీ జనాలు. కాకపోతే ఈ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఇప్పటి వరుకు స్క్రీన్ మీద రాని స్థాయిలో ఉంటుందట.

ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి షూటింగ్ అనుకున్న విధంగా జరగలేదట. ఏదో రకంగా అడ్డంకులు రావడంతో.. షూటింగ్ కొన్నాళ్లు ఆగింది. దీంతో కాంచనకు కూడా కష్టాలు తప్పడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలకు వచ్చిన కష్టాల వలనో ఏమో కానీ.. ఇక హర్రర్ సినిమాలు చేయకూడదని.. ఈ హర్రర్ సిరీస్ ను కాంచన 4 తో ఎండ్ చేయాలని లారెన్స్ నిర్ణయం తీసుకున్నారట. ఈమధ్య కాలంలో లారెన్స్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అందుకనే లారెన్స్ మళ్ళీ కంబ్యాక్ అయ్యేందుకు కాంచన 4ని ఎందుకున్నారు. ఇప్పటికే ఏడాదిన్నరగా షూటింగ్ లో ఉన్న కాంచన 4కి మరో నాలుగైదు నెలలు అవసరం పడొచ్చని టాక్. మరి.. కాంచన 4తో లారెన్స్ ఏ రేంజ్లో మెప్పిస్తారో..చూడాలి.

Latest Articles

ఢిల్లీలో ఖర్చు నియంత్రణకు కీలక నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్

దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల వినియోగం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్