పోక్సో కేసు దర్యాప్తులో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులకు బండి భగీరథ ఈమెయిల్ ద్వారా లేఖ పంపించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, మే 15న విచారణకు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు.
తన వద్ద ఉన్న కీలక ఆధారాలతో విచారణకు వస్తానని, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని భగీరథ లేఖలో తెలిపారు.
పోలీసులు జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో భగీరథ స్పందించడం ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ (SIT) అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.


