మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ ఇద్దరి కాంబోలో ఆచార్య మూవీ రావడం.. అది డిజాస్టర్ అవ్వడం.. తెలిసిందే. ఇప్పుడు బాలయ్యతో కొరటాల భారీ చిత్రం చేస్తున్నారు. త్వరలో ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి రానుంది. అయితే.. ఆచార్య మూవీకి, బాలయ్య మూవీకి లింకు ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. దీంతో ఈ వార్త వైరల్ అయ్యింది. అంతే కాకుండా బాలయ్య మూవీ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీ టైటిల్ ఏంటి..? ఆచార్యతో ఉన్న లింక్ ఏంటి..? తెలుసుకుందాం.. రండి..
ఆచార్య సినిమాలో చిరంజీవి పాదఘట్టంకు వచ్చినప్పుడు కార్పెంటర్ గా కనిపిస్తాడు. అక్కడి జనాలకు అలాగే పరిచయమవుతాడు. ఇప్పుడు బాలయ్యతో కొరటాల చేసే సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ ను కార్పెంట్ గా చూపించబోతున్నాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇప్పుడు స్టార్ హీరోలను కోటీశ్వరలుగానో, పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టుగానో చూపిస్తున్నారు. కానీ.. కొరటాల మాత్రం కార్పెంటర్ గా చూపిస్తుండడం విశేషం. కార్పెంటర్ అనేది మన నిత్య జీవితంలో ఎంతగానో ముడిపడిన పేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కార్పెంటర్ తో ఖచ్చితంగా పని పడుతూనే ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ ను పెడితే.. మాస్ కి త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే.. కొరటాల ఇలా ప్లాన్ చేసారని టాక్ వినిపిస్తోంది.
మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి టైటిల్ కూడా కార్పెంటర్ అనే పెట్టాలి అనుకుంటున్నారట కొరటాల. ఎక్కడ పొగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి అంటారు. అందుచేత.. హీరోని కార్పెంటర్ గా చూపించి.. ఆచార్య అనే సినిమా తీస్తే అది డిజాస్టర్ అయ్యింది. అందుకనే.. ఇప్పుడు అదే క్యారెక్టర్ తో మరో సినిమా చేసి సక్సెస్ సాధించాలని కొరటాల పట్టుదలగా ఉన్నారేమో అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే.. మే 21 ఓపెనింగ్ చేయబోతున్నారని తెలిసింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మొదటిసారి బాలయ్యకు మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.
అబ్బాయ్ ఎన్టీఆర్ తో కొరటాల జనతా గ్యారేజ్, దేవర అంటూ బ్లాక్ బస్టర్స్ అందించారు. మరి.. బాబాయ్ బాలయ్యతో కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందిస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఒకవేళ కుదరకపోతే 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. మరి.. బాలయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని కొరటాల ఎంత వరుకు సద్వినియోగం చేసుకుంటారో.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.


