37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

సూర్య.. రిస్కీ ప్రయత్నం ఫలించేనా..?

కోలీవుడ్ స్టార్ సూర్య.. తమిళ్ లో ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నారో.. తెలుగులో కూడా అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే.. గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు అటు తమిళ్ లోనూ, ఇటు తెలుగులోనూ సరిగా ఆడడం లేదు. వరుసగా ప్లాపులతో వెనకబడిన సూర్య.. ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సూర్య రిస్క్ చేస్తున్నాడని.. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన ఈ టైమ్ లో ఎందుకు రిస్క్ చేస్తున్నాడని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంతకీ.. సూర్య చేస్తున్న రిస్క్ ఏంటి..?

సూర్య నటించిన కరుప్పు మూవీని తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అన్ని అడ్డంకులను దాటుకుని.. ఈ నెల 14న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందులో సూర్యకు జంటగా త్రిష నటించింది. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. మాస్ జనాలకు వీరభద్రుడు విపరీతంగా నచ్చేస్తాడని.. సూర్యకు ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. సూర్య నటిస్తున్న మరో మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ బాగానే ఉంది కానీ.. వావ్ అనిపించేలా భారీగా బజ్ అయితే రాలేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఈ మూవీని ఆగష్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త లీకైనప్పటి నుంచి సూర్య రిస్క్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండిపెండెన్స్ డేకి బాక్సాఫీస్ దగ్గర పోటీ కాస్త గట్టిగానే ఉంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 ఆగష్టులో ఇండిపెండెన్స్ డేకి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే టైంలో సన్నీ డియోల్ లాహోర్ 1947 మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆగష్టు 13న రిలీజ్ కానుంది. అమీర్ ఖాన్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వారం గ్యాప్ లో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ ఆగష్టు 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాల మధ్య ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ చేయడం అంటే రిస్కే అనేది ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వరుసగా ఫ్లాపులతో వెనకబడిన సూర్య.. వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేస్తే.. హాలీడేస్ కలిసొస్తాయి అనుకుంటున్నాడట. అందుకే.. రిస్క్ అయినా సరే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. సూర్య రిస్కీ ప్రయత్నం ఎంత వరుకు ఫలిస్తుందో చూడాలి.

Latest Articles

కష్టపడిన వారిని పక్కనపెడుతున్న పవన్…జనసేనలో అంతర్మథనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, వలస నేతలకు పెద్దపీట వేయడంపై జనసైనికుల్లో అసంతృప్తి రగులుతోంది. పొరుగు రాష్ట్రం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్