35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

వైరలైన కియరా కామెంట్స్..

ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ఏదైనా వార్త బయటకు వస్తే చాలు… అది నిజమా..? కాదా.? అనేది క్లారిటీ వచ్చే లోపే వైరల్ అయిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కియారాకు సంబంధించిన వార్త విషయంలో కూడా అదే జరిగింది. ఈ అమ్మడు టాక్సిక్ అనే సినిమాలో నటించింది. అయితే.. ఈ క్రేజీ బ్యూటీ గురించి ఓ న్యూస్ ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయ్యింది. దీంతో.. కియారా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఏ వార్త లీకైంది..? కియారా ఏమని క్లారిటీ ఇచ్చింది..?

సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి టాక్సిక్. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ హీరోగా నటిస్తే.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ లో బోల్డ్ సీన్స్ ఉండడంతో సినీ అభిమానులు షాక్ అవ్వడం.. ఆతర్వాత సోసల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని కథానాయిక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. యశ్ తో తన పై చిత్రీకరించిన బోల్డ్ సీన్స్ ను తొలగించాలని మేకర్స్ ని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనేది బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ వార్త వైరల్ అవ్వడంతో ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై కియారా స్పందించింది. అలాంటిది ఏమీ లేదని.. ఆధారాలు లేని ఇలాంటి వార్తలను నమ్మద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాని నిరంతరం వార్తల్లో ఉంచడం కోసం కొంత మంది కావాలనే ఇలా ప్రచారం చేస్తుంటారు. ఇలా చేయడం వలన సినిమాకి ప్లస్ అవ్వడం ఏమో కానీ.. మైనస్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా నయనతార, త్రిష, తమన్నా నటించిన చిత్రాల విషయంలో ఇలాగే ప్రచారాలు చేసినా.. ఆతర్వాత కథానాయికలు వివరణ ఇచ్చారు.

అయినా ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. బోల్డ్ సీన్స్ కోసం కాదు.. కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. అందుచేత.. స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారని టాక్సిక్ టీమ్ బలంగా నమ్ముతుంది. జూన్ 4న రావాల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యింది. త్వరలో రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. మరి.. టాక్సిక్ మేకర్స్ నమ్మకం ఎంత వరుకు నిజమౌతుందో చూడాలి.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్