35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని స్పష్టంగా ప్రకటించారు. తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోలేదని, ఫలితాలు బీజేపీ కుట్రల కారణంగా తారుమారయ్యాయని ఆరోపించారు.

మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాము ప్రత్యర్థి పార్టీలతో కాకుండా “విలన్లతో” పోరాడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం (CEC) పాత్రపై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని అన్నారు.

ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు, ఓట్ల తొలగింపు వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బీజేపీకి సుమారు 100 సీట్లు అన్యాయంగా లభించాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితి దేశానికి మంచిది కాదని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీకి అలవాటైందని విమర్శించిన మమతా… ఈ పరిస్థితులపై తాము పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలపై చట్టపరంగా , రాజకీయంగా పోరాడతామని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది.

Latest Articles

హీటెక్కిన తమిళనాడు పాలిటిక్స్‌.. రేపు లోక్‌భవన్‌ ముట్టడికి పిలుపు

తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కాయి. రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. రెండు సార్లు గవర్నర్ ను విజయ్ కలిసినప్పటికి ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అటు గవర్నర్‌ వైఖరిని నిందిస్తూ కాంగ్రెస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్