కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఎన్నికల ఫలితం ప్రకటించబడింది. ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది కృష్ణారావు విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 35,840 ఓట్లు పోలవగా, మల్లాడి కృష్ణారావుకు 19,863 ఓట్లు లభించాయి. ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్‌కు 15,295 ఓట్లు మాత్రమే వచ్చాయి. యానాంలో ఈ ఫలితం ఎన్నార్ కాంగ్రెస్‌కు కీలక విజయంగా నిలిచింది.


