పవన్‌ కళ్యాణ్‌ బాటలో తమిళ హీరో విజయ్‌..!

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవన్‌ కళ్యాణ్‌ బాటలోనే తమిళ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ నడుస్తున్నారా?.. లేదా నడిచే చాన్సెస్‌ ఉన్నాయా?.. ఇప్పుడిదే ప్రశ్న తెలుగు, తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విజయ్‌కి ఇచ్చిన సలహాతో ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌ కళ్యాణ్‌ వ్యూహం దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన తమిళగ వెట్రి కళగం సభలో రాష్ట్రాన్ని పాలించే డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు శుత్రువులని విజయ్‌ ప్రకటించారు. తన నాయకత్వాన్ని స్వీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని కూడా ఆయన తెలిపారు. అయితే ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. విజయ్‌ని కలిసి కొన్ని సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

పీకే సూచనలు

ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి అయితే.. విజయ్‌ ఉప ముఖ్యమంత్రి అనే సూచన పీకే.. విజయ్‌కి ఇచ్చినట్లు సమాచారం. 2026 ఎన్నికల్లో గెలవాలంటే అన్నాడీఎంకేతో జత కట్టాలని .. అప్పుడే డీఎంకేను ఓడించడం సాధ్యమవుతుందని విజయ్‌కి పీకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకేకు కనీసం 25 శాతం ఓట్లు ఉంటాయని, టీవీకేకు అత్యధికంగా 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ అంచనా వేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీలను చేర్చుకుంటే మొత్తం 50 శాతం ఓట్లు దక్కుతాయని పీకే విజయ్‌కి చెప్పారని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. పీకే ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా కూడా చూపించి ఈ సలహా ఇచ్చారట.

ఉదాహరణగా ఏపీ

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న విజయ్‌కి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను చూపించి ఈ సలహా ఇచ్చారట. ఏపీలో వైసీపీని గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్ ఎలా జత కట్టి విజయం సాధించారో వివరించారట. పవన్‌ మాదిరిగానే పళనిస్వామి సీఎం, విజయ్‌ డిప్యూటీ సీఎం అని ఒప్పందం చేసుకోవచ్చని సూచించారని సమాచారం. అయితే విజయ్‌ మాత్రం ఈ ఫార్ములాను అంగీకరించడానికి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారని తెలుస్తోంది.

ఏపీలో కూటమి ఫార్ములాని విజయ్‌ కూడా ఫాలో అవుతారా?.. ఒకవేళ అదే విధంగా ఒప్పందం చేసుకున్నా.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారా?.. ముఖ్యమంత్రి కావాలన్న విజయ్‌ కలలు నిజమవుతాయా?..అనేది వేచి చూడాల్సిందే.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్