ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో అన్నారు. అమరులైన వీర జవాన్లకు ఆమె నివాళులు అర్పించారు. 41 మంది భారత మాత ముద్దు బిడ్డలు విధులు నిర్వహిస్తుండగా పొరుగు దేశం వారు చేసిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు. 2014కు ముందు సైన్యంలో ఉండే అస్తవ్యస్థ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయని ఆమె తెలిపారు. దేశ రక్షణ, భద్రత కోసం అహర్నిశలు సేవలు అందిస్తున్న సైనికులకు ప్రధాని మోదీ పలు విధానాలను తీసుకొచ్చారని ఆమె చెప్పారు.