తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి .. ఫేక్‌ ఐడీ కార్డుతో

తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. నకిలీ ఉద్యోగి కదలికలపై అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టింది. అతని కదలికలను గమనించి పూర్తి ఆధారాలు సేకరించి ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు చాకచక్యంగా పట్టుకున్నారు.

నకిలీ ఉద్యోగిని ఖమ్మంకు చెందిన భాస్కర్‌రావుగా గుర్తించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మైనార్టీ డిపార్ట్‌మెంట్‌ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావు ఫేక్ ఐడీ కార్డు తయారు చేసినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.

డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకుంది ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్. అలాగే రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిపై ఇంటెలిజెన్స్ అధికారులు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి కంప్లైంట్ ఆధారంగా డ్రైవర్‌ రవి, భాస్కర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు?.ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా?.. సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది..? వీరికి ఎవరు సహకరించారు? వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి వద్ద నిందితులు పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ1గా భాస్కర్ రావు, ఏ2 గా డ్రైవర్ రవిని చేర్చారు పోలీసులు. నకిలీ ఉద్యోగి భాస్కర్‌ రావు గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టిన రోజు అనుమానం రావడంతో తీగ లాగితే డొంక కదిలింది. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్