కాకినాడ సెజ్‌ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

కాకినాడ సెజ్‌ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. కాకినాడ సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు కాకినాడ సీ పోర్టు,.కాకినాడ సెజ్‌లోని మేజర్‌ వాటాను బలవంతంగా తీసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్‌ల్లోని రూ.3600 కోట్ల విలువైన షేర్లను తన నుంచి లాగేసుకున్నారని ఆయన ఇచ్చిన కంప్లైంట్‌ ఆధారంగా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించి ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే తాను పార్లమెంటు సమావేశాల కారణంగా రాలేనని విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చారు. దీంతో మళ్లీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్