32.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

గేమ్‌ఛేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదిక ఫిక్స్‌.. అతిథిగా పవన్‌ కళ్యాణ్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈనెల 4వ తేదీన వేమగిరి వేదికగా.. గేమ్ చెంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగా హీరో రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

వేమగిరిలో సభా స్థలాన్ని పరిశీలించి మెగా అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు , చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ. 4వ తేదీన వేమగిరిలో జరిగే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని రవణం స్వామినాయుడు తెలిపారు.

హైదరాబాద్‌లో సంథ్య థియేటర్ ఘటన జరగకుండా ఇప్పటికే అభిమానులకు దిశా నిర్దేశం చేశామని చెప్పారు. పోలీసులు ఇచ్చిన నిబంధనలు మేరకు సుమారు లక్ష మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. అంతకుమించి వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. దేశ చరిత్రలో ఈవెంట్ నిలిచిపోయేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని రవణం స్వామి నాయుడు తెలిపారు.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్యాన్‌ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇవాళ సాయంత్రం ఏఎంబీలో ట్రైలర్ లాంచ్‌ కాబోతుంది. దీనికి తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Latest Articles

పెద్ద పెద్ద పాముల వెనుక ఉన్న రహస్యం… కొన్ని జాతులు ఎందుకు అంత పెద్దగా పెరుగుతాయి?

ప్రకృతి ప్రపంచంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి… అందులో కొన్నింటిని చూస్తే ఇవి ఇంత అద్భుతంగా ఎలా మారాయి?... అనే సందేహాలు కలగక మానవు. అలాంటి జీవుల్లో ముఖ్యమైనవి… పాములు. పాములు లేదా సర్పాలు......
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్