హైదరాబాద్‌లో 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్స్‌లతో సందడి చేశారు. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా మందుబాబులు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్‌ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 11 వందల 84 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్‌ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదు కాగా.. సౌత్‌ ఈస్ట్‌ జోన్‌లో 192, వెస్ట్‌ జోన్‌లో 179 కేసులు, సౌత్‌ వెస్ట్‌ జోన్‌లో 179 కేసులు, నార్త్‌ జోన్‌లో 177 కేసులు, సెంట్రల్‌ జోన్‌లో 102 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని వెంగళరావు పార్క్‌ వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పోలీసుల టెస్టులో భాగంగా అతడికి 550 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. రోడ్ల మీద పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.

హైదరాబాద్‌ చంపాపేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు సంతోష్ నగర్, మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు . సుమారు 40కి పైగా కేసులు నమోదయ్యాయి. నాచారం పరిసర ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని చెక్ చేశారు ట్రాఫిక్ పోలీసులు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్