అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు

చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నిని ప్రశ్నించారు. అడ్వొకేట్‌ అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అల్లు అర్జున్‌ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.

తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్‌ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్‌ షో ఎలా నిర్వహించారు..? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సుమారు మూడున్నర గంటలపాటు విచారణ కొనసాగింది. విచారణలో అల్లు అర్జున్‌ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

Latest Articles

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒకే రోజు రెండు ప్రమాదాలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరగంట ముందు SMS-2Aలోనూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్