‘ఫియర్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన రాఘవ లారెన్స్

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “ఫియర్” మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకనిర్మాత రాఘవ లారెన్స్ ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా..మేఘన, నీల్ క్రితన్ ఆకట్టుకునేలా పాడారు. ఫియర్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో ఉండటం ‌విశేషం. నాయిక వేదిక క్యారెక్టర్ ను భయాలు ఎలా చుట్టుముట్టాయి. ఆ ఫియర్ ప్రభావం ఆమె మీద ఎంతగా ఉందో చెప్పేలా ఈ పాటను డైరెక్టర్ డా. హరిత గోగినేని ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్