28.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్‌కు ఎదురుదెబ్బ

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

సీబీఐ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామరాజు ఇటీవల గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని నగరపాలెం పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం గత నెలలో హైకోర్టును ఆశ్రయించగా విజయ్‌పాల్‌కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్