‘ప్రణయగోదారి’ నుంచి సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ మాస్టర్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.

ప్రణయ గోదారి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నాయి. ధనుంజయ్, అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి పాటను ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. దర్శక నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ : పీఎల్వీ క్రియేషన్స్
నిర్మాత :పారమళ్ళ లింగయ్య
దర్శకుడు :పి.ఎల్.విఘ్నేష్
కో డైరెక్టర్: పురం కృష్ణ
సంగీతం:మార్కండేయ
కెమెరా:ఈదర ప్రసాద్
చీఫ్ కోడైరెక్టర్:జగదీష్ పిల్లి
డిజైనింగ్:టీఎస్ఎస్ కుమార్
అసిస్టెంట్ డైరెక్టర్:గంట శ్రీనివాస్
కొరియోగ్రాఫీ:కళాధర్,మోహనకృష్ణ,రజిని
ఎడిటర్:కొడగంటి వీక్షిత వేణు
ఆర్ట్:విజయకృష్ణ
కాస్ట్యింగ్ డైరెక్టర్:వంశీ ఎమ్.
పీఆర్వో: సాయి సతీష్

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్