సీఎం రేవంత్ రెడ్డి తొండి చేయడంలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్ అని బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు సెటైర్ వేశారు. ఈ రెండు విషయాల్లో ఆయన్ను కొట్టేవాడు లేరని విమర్శించారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు భేషరతుగా రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ప్లాఫ్ అని స్పష్టమవుతుందని అన్నారు. రుణమాఫీలో కోత.. మాటలేమో రోత అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. బూతులు తిడితే రైతు రుణమాఫీ పూర్తవుతుందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.