2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా సోల్జర్స్‌పై ఉందని ఆయన చెప్పారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులను సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేయాలని మంత్రి ఆదేశించారు.