తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ భార్యాపిల్లలు ఆరోపిస్తున్న దివ్వెల మాధురి ఎవరనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకూ.. మాధురికి మధ్య వాణి లేని పోనివి అంటగట్టిందని వాపోయారు దువ్వాడ శ్రీనివాస్. వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మ హత్య చేసుకోబోయిందన్నారు. తన భార్య డంబుల్తో తనపై దాడి చేసిందని అంత తప్పు తానేం చేశానని ప్రశ్నించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నానని.. ఇప్పుడు తన కుమార్తెలే తనపై విషం చిమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఎండ కూడా తగలనివ్వలేదని దువ్వాడ అన్నారు. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టే బయటకి వచ్చానని తెలిపారు.


