ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయన్నారు మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడిందని.. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ళ కుల్లును, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుందన్నారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడింది – కేటీఆర్
0
278
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


