సీఎం రేవంత్‌రెడ్డి ఆగష్ట్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. ఆగష్ట్ 3న హైదరాబాద్ నుంచి నేరుగా న్యూయార్క్ చేరుకోనున్నట్టు సమాచారం. టూర్‌లో భాగంగా పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నాట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది. న్యూయార్క్, డల్లాస్, శాన్‌ప్రాన్సిస్‌కో, న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపార వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని… లైఫ్ సైన్స్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలు, టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారని తెలిపారు.
వచ్చే నెల అమెరికాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
0
141
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


