35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

తెలుగు రాష్ట్రాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన

    ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీంతోపాటు ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వానలు పడుతుండగా, మరోమూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరిం చింది వాతావరణశాఖ. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపిన అధికారులు.. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, నిర్మల్‌, మంచి ర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేటలో వర్షాలు కురుస్తాయని ఖమ్మం, మహబూబాబా బాద్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Latest Articles

తెలుగు సినిమాల పైనే ఫోకస్ పెట్టిన కార్తి..

కోలీవుడ్ స్టార్ కార్తి.. తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఊపిరి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించి.. తెలుగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్