బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వరుణ్ సందేశ్ ‘నింద’

ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం నింద. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్, రివ్యూలు వచ్చాయి. దర్శకుడు రాజేష్ జగన్నాధం తన తొలి ప్రయత్నంలో సఫలమయ్యారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

వరుణ్ సందేశ్ తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. వరుణ్ సందేశ్‌కి నింద పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అయిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నందుకు వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

మంచి వసూల్లతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా నింద దూసుకుపోతోంది. వరుణ్ సందేశ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో నెం.1 వసూళ్లు సాధించిన చిత్రంగా నింద నిలవనుంది. మంచి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ కమర్షియల్‌గా హిట్‌ అవుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

Latest Articles

నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్