తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపు స్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శిం చారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. 422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాల వారు చదువుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యావ్య వస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, జూనియర్ కళాశాలల్లో ఉన్న 16 వందల 54 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు-హరీష్‌రావు
0
175
Previous article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


