‘ఓ మంచి ఘోస్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది. థియేటర్లో అయినా,ఓటీటీలో అయినా ఈ జానర్‌ను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు మేకర్లు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే చిత్రం రాబోతోంది.

ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘ఓ మంచి ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ వంటి వారు కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తూ, భయపెట్టేలా కనిపిస్తోంది.

నటీనటులు : వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు తదితరులు

సాంకేతిక సిబ్బంది
బ్యానర్: మార్క్‌సెట్ నెట్‌వర్క్‌
ప్రొడ్యూసర్: డా.అబినికా ఇనాబతుని
డైరెక్టర్: శంకర్ మార్తాండ్
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్