ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు

    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన చంచల్ గూడ జైల్లో ఉన్న CCS ACP ఉమా మహేశ్వరావును ఏసీబీ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాల యానికి ఉమా మహేశ్వరరావును తరలించారు. ఉమామహేశ్వర్ రావు అక్రమాస్తులపై ఆరా తీయను న్నారు. కస్టడీ విచారణలో మరికొంత మంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వర్‌ రావు నివాసంలో సోదాలు సందర్భంగా భారీగా ఆస్తులు గుర్తించారు. 37లక్షల నగదు, 60 తులాల బంగారం లభించాయి. దానితో పాటు స్థిర చరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై లోతుగా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చంచల్‌గూడా వెళ్లి ఉమామహేశ్వర్‌రావును అదుపులోకి తీసుకోనున్నారు.

Latest Articles

విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్