29.7 C
Hyderabad
Monday, April 13, 2026
spot_img

తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడి సంగీతమా ?

   తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడు మ్యూజిక్ ఇవ్వడమా ? తెలంగాణలో సమర్థులైన వాళ్లు లేరా ? లేదంటే మరేదైనా కారణం ఉందా ? అవతరణ దినోత్సవాల సందర్భంగా రేవంత్ సర్కారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్న వేళ సరికొత్త వివాదం రేగింది. అయితే పాట రాసిన అందెశ్రీకే రూపకల్పన బాధ్యతలు అప్పగించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు. సంగీత దర్శకుడి ఎంపికలో తనపాత్ర లేదంటూ స్పష్టత నిచ్చారు ముఖ్యమంత్రి. మరి ఇకనైనా ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందా ?

రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబవుతోంది తెలంగాణ. జూన్ రెండున జరగనున్న వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి తమకు అవకాశం దక్కడంతో హస్తం పార్టీ నేతలు మరింత హుషారుగా సంబరాలను జరిపేందుకు సిద్దమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అవతరణ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్ర గీతాన్ని ప్రత్యేకంగా విడుదల చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు గతంలోనే పాట రాసిన అందెశ్రీతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయజయహే తెలంగాణ పాట విన్న ఆయన అవసరమైన మార్పులు చేర్పులు సూచించారు. దీనికి సంగీతం సమ కూర్చే బాధ్యతలు తీసుకున్న సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితోనూ మాట్లాడారు. చివరకు పాటకు తుదిమెరుగులు దిద్దిన తర్వాత మరోసారి పరిశీలించి జూన్ రెండున రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించా లని భావిస్తున్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది.

   తెలంగాణ రాష్ట్ర గీతం అంటే, అధికారికమైనది. ఈ పాట విడుదలైన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ఈ గీతాన్ని ఆలపిస్తారు. విద్యా సంస్థల్లోనూ పాడతారు. అంతటి ప్రాధాన్యం ఈ పాటకు ఉంటుంది. అయితే, ఇంత గొప్ప ప్రాముఖ్యం ఉన్న తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రాకు చెందిన ఎంఎం కీరవాణికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యత అప్పగించడంపైనే తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నారని, అలాంట ప్పుడు వారందర్నీ కాదని ఏపీకి చెందిన కీరవాణికి ఇంత కీలకమైన గీతానికి సంగీతం అందించే బాధ్యత అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఆంధ్రా వాళ్ల దోపిడీని వ్యతిరేకిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి అని, మళ్లీ ఇప్పుడు వారికే ఇంత కీలకమైన రాష్ట్ర గీతానికి సంగీతం అందించే బాధ్యతలు కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారుతోంది.

    వాస్తవానికి ఈ గీతం ఇప్పటిది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రముఖ కవి అందెశ్రీ ఈ పాట రాశారు. ప్రత్యేక ఉద్యమంలో ఈ పాట బాగా పాపులరైంది కూడా. అయితే, తెలంగాణ వచ్చి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర గీతంగా ఈ పాట ఉండాలని సెలెక్ట్ చేశారు. అయితే, కొంచెం పెద్దదిగా ఉండడంతో స్వయంగా కేసీఆరే కొన్ని మార్పు లు చేర్పులు చేశారు. కానీ, ఆ తర్వాత ఏమైందో కానీ, పదేళ్లుగా ఎలాంటి చడీ చప్పుడూ ఈ పాట విషయంలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పలు మార్పులు చేర్పుల్లో భాగంగా రాష్ట్రానికి ఓ అధికారిక గీతం ఉండాలని భావించారు. దీంతో కవి అందెశ్రీ ఇప్పటికే రాసిన జయ జయహే తెలంగాణ పాటను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఒకదాని వెంట మరోటిగా అన్నట్లుగా పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే తాజా వివాదం నేపథ్యంలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే పాట రూపకల్పన చేసే బాధ్యతలు సైతం అప్పగించామ న్నారు. దీంతో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణిని ఎంపిక చేసుకున్నారని, ఇందులో తన పాత్ర ఏ మాత్రం లేదని మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే, రాష్ట్ర గీతం అనేది చాలా ప్రత్యేకమైనది. పైగా ఎంతో గర్వకారణమైనది. దీన్ని ఆ కోణంలోనే చూడాలి తప్ప మరోటి కాదన్నది అందరూ చెప్పేమాట.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్