ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హింసాకాండపై సిట్ బృందం విచారణ చేస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీమ్ వెళ్లనుంది. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇచ్చింది. పూర్తి నివేదికను ఇచ్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతుంది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపులాంటి అంశాలపై పరిశీలిస్తున్నారు. గొడవలకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో సిట్ బృందం ఉంది.
మరోవైపు తాడిపత్రి అల్లర్ల ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డిలకు కూడా హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలోకి వెళ్ళ వద్దంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం సూచించింది. తాడిపత్రిలో కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు సిట్ అధికారులు జిల్లాలోనే మకాం వేయను న్నారు. ఇప్పటికే 639 మంది అల్లర్లు , రాళ్లదాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 102 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కౌంటింగ్ రోజు తాడిపత్రిలోకి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్నాడు ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కౌంటింగ్ వరకు తాడిపత్రిలోనే సిట్ బృందం ఉండనుంది. ఇప్టపికే అల్లర్లలో 638 మందిని పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో అల్లర్లు, రాళ్ల దాడి చేసిన వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఇప్పటికే పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. కింది స్థాయి అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతోంది ఈసీ.


