నిరుపేద మత్స్యకార కుటుంబంలో పుట్టి బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి కొల్లాటీ అశోక్ కుమార్‌కు అవనిగడ్డకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. జూన్‌లో నార్త్ అమెరికాలో జరగనున్న అంత ర్జాతీయ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాల్సి ఉన్న అశోక్ కుమార్‌కు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఎదురుమొండి గ్రామ పెద్దల ద్వారా తెలుసుకున్న శ్రీనివాస్. అశోక్ కుమార్ అమెరికా వెళ్లేందుకు ఆర్థిక సాయం అందించడంతోపాటు తన మిత్ర బృందం ద్వారా మరింత సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అశోక్‌కు చెక్ అందించి ఘనంగా సత్క రించారు.
నిరుపేదగా పుట్టి బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగిన అశోక్
0
261
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


