హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

   మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్‌ జర్మనీ నుంచి లండన్‌కు రైల్లో వెళ్లాడని సిట్‌ ధ్రువీకరించింది. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించిన సిట్  కోర్టును ఆశ్రయించి అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యాయి. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌.డి.రేవణ్ణ ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చారు. అంతకుముందు ఆయన ఏడు రోజులు జైల్లో ఉన్నారు. ప్రజ్వల్‌పై చర్యలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ ఇప్పటికే స్పష్టం చేశారు.

Latest Articles

రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు

వర్చువల్‌ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్