కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌పై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. సత్యనారాయణపై 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 11 మంది క్యాంపులో ఉన్నారు. కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోవైపు అధికారులు అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు ఛైర్మన్ సత్యనారాయణ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అందుకు నిరసనగా 11 మంది కౌన్సిలర్లు అదే రోజు కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానా న్ని లిఖితపూర్వంగా అంద జేశారు. మున్సిపల్ ఛైర్మన్ పని తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు గత కొంతకాలంగా అసంతృప్తి తో శిబిరాలు ఏర్పాటు చేశారు. క్యాంపుకు వెళ్లిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం
0
195
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


