32.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల అధికారులు వివరాలు ప్రకటించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34శాతం ఓటింగ్ నమోదైంది.

ఆదిలాబాద్‌ 74.03 శాతం, పెద్దపల్లి 67.87, కరీంనగర్ 72.54 శాతం, నిజామాబాద్‌ 71.92, జహీరాబాద్‌ 74.63, మెదక్‌ 75.09, మల్కాజ్‌గిరి 50.78, సికింద్రాబాద్‌ 49.04, చేవెళ్ల 56.50, మహబూబ్‌నగర్ 72.43, నాగర్‌కర్నూల్ 69.46 శాతం, భువనగిరి 76.78 శాతం, నల్గొండ 74.02, హైదరాబాద్ 48.48 శాతం, వరంగల్‌ 68.86 శాతం, మహబూబాబాద్‌ 71.85, ఖమ్మంలో 76.09 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు.

Latest Articles

పెద్ద పెద్ద పాముల వెనుక ఉన్న రహస్యం… కొన్ని జాతులు ఎందుకు అంత పెద్దగా పెరుగుతాయి?

ప్రకృతి ప్రపంచంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి… అందులో కొన్నింటిని చూస్తే ఇవి ఇంత అద్భుతంగా ఎలా మారాయి?... అనే సందేహాలు కలగక మానవు. అలాంటి జీవుల్లో ముఖ్యమైనవి… పాములు. పాములు లేదా సర్పాలు......
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్