అల్లు శిరీష్ ‘బడ్డీ’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ రోజు “బడ్డీ” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆ పిల్ల కనులే..’ రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. ‘ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..’ అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – హిప్ హాప్ తమిళ
బ్యానర్ – స్టూడియో గ్రీన్ ఫిలింస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
ప్రొడ్యూసర్ – కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – శామ్ ఆంటోన్

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్