సల్మాన్ ఖాన్ ‘సికిందర్’లో హీరోయిన్‌గా రశ్మిక మందన్న

స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న వరుస అవకాశాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా రశ్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్ దక్కుతున్నాయి. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది రశ్మిక మందన్న. ఆమె తాజాగా మరో బిగ్గెస్ట్ మూవీ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు.

‘‘సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నటించేందుకు రశ్మిక మందన్నకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్ పండక్కి తెరపై సల్మాన్, రశ్మిక జంట తెరపైకి వస్తారు. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా దక్కడంపై రశ్మిక మంందన్న ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. నా నెక్ట్ మూవీ అప్డేట్ చెప్పమని ఫ్యాన్స్ తరుచూ అడుగుతుంటారు. సల్మాన్ సరసన సికిందర్ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా.’’ అని పోస్ట్ చేసింది.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో ఉన్న రశ్మిక ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. ఆమె గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. రశ్మిక అందుకుంటున్న అవకాశాలు చూస్తుంటే ప్రస్తుతం ఆమె బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ అనుకోవచ్చు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్