ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు రాజకీయం రసవత్తరంగా మారింది. కచ్చితమైన కాపు ఎవరు. కల్తీ కాపు ఎవరు. ప్రస్తుతం దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ చేసిన వైసీపీ. మెగా బ్రదర్స్‌పై విరుచుకుపడుతోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలని కోరిన చిరంజీవిని వైసీపీ నేతల పోసాని కృష్ణ మురళీ టార్గెట్ చేశారు. రాజకీయాల కు చిరంజీవి అన్ ఫిట్ అంటూ ఆయన కామెంట్ చేశారు. కాపులకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారని, చాలామంది కాపుల జీవితాలను చిరంజీవి నాశనం చేశారన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు కాపు నేత ముద్రగడ. పవన్ నిజమైన కాపు అయితే తన చరిత్ర బయటపెట్టాల న్నారు. తనకు తన కూతురుని దూరం చేశారని మండిపడ్డారాయన.
రసవత్తరంగా పిఠాపురం రాజకీయం
0
342
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


