స్వల్పంగా తగ్గిన బంగారం ధర

      గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ కాస్త ఊరటనిచ్చాయి. తులం బంగారం రేటు స్వల్పంగా దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.68 వేల 50 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.100 మేర తగ్గి ప్రస్తుతం రూ. 74 వేల 240 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.100 తగ్గి రూ. 68 వేల 50 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.100 తగ్గి తులం ధర రూ.74 వేల 240 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్‌లో ఎలాంటి మార్పు లేకుండా రూ.86 వేల 500 మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్