లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా పని చేసిన రవీంద్ర నాయక్.. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటు పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడిని తానేనని అయినా ఏ విషయంలోనూ బీజేపీ నేతలు తనను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్ గూటికి చేరారు.
కాంగ్రెస్ గూటికి మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్
0
342
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


