31.4 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

పర్యాటక ప్రాంతంగా…

పవిత్ర సంగ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు మైలవరం టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్‌. పంచ హారతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ ఇబ్రహీం పట్నంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ఓట్లను అభ్యర్ధించారు. 17వ వార్డులో రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ బంధువులు వసంత ప్రసాద్‌ సమక్షంలో టీడీపీలో చేరడం విశేషం.

బోడె నామినేషన్‌

ఎన్డీఏ కూటమి అభ్యర్ధి బోడె ప్రసాద్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కృష్ణాజిల్లా పోరంకిలోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, వంగవీటి రాధ తదితర నేతలు పాల్గొన్నారు.

స్వామివారి సన్నిధిలో…

తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ సిఎస్ శాంతి కుమారి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానం తరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.

సస్పెండైన వెంకట్రామిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఈసీ వేటుకు గుర య్యారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాలతో వెంకట్రామిరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని పేర్కొంది.

గరుడ ప్రసాదం

గరుడ ప్రసాదం కోసం హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ దేవాలయంకు భక్తులు భారీగా తరలివచ్చారు. జంట నగరాల నుంచి వేలాదిగా మహిళలు తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంతానం కాని మహిళలు కోసం ఈ ప్రసాదాన్ని అర్చకులు పంపిణీ చేసారు.

అప్రమత్తత అవసరం

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు ఎస్పీ శబరీష్‌. ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి సూచనలు చేసారు. గుత్తికోయ గూడాలను సందర్శించిన ఆయన సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని గూడెం వాసులకు హితవు పలికారు,

30కిలోల భారీ చేప

రాజరాజేశ్వర జలాశయంలో చేపల కోసం వల వేసిన మత్స్యకారుడి పంట పండింది. వలకు 30 కిలోల మీనం జాతికి చెందిన భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుడు ర్యాకం అనిల్‌ సంతోషం వ్యక్తం చేసా డు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక జలాశయంలో ఈ భారీ చేప చిక్కింది.

‘సూర్య’ ప్రతాపం

తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గురువారం రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరొకరు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రానికి ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

విద్యుత్‌ వైర్లు తగిలి….

అటవీ జంతువుల కోసం కొందరు ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ తీగలు తగిలి నాలుగు పాడి గేదెలు మృతి చెందాయి. ములుగు జిల్లా ముల్లెగట్ట రాంపూర్‌ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. లక్షా 20 వేల రూపా యలు మేర నష్టం వాటిల్లింది. విద్యుత్‌ తీగల ఏర్పాటుకు కారకులైన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు గ్రామస్తులు.

పెళ్లి బట్టలతో….

పెళ్లి వేడుకలు పక్కనపెట్టి ఓటు హక్కును వినియోగించుకుంది ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో దీప అనే నవ వధువు. పెళ్లి బట్టలతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. మరోపక్క ఉత్తరాఖండ్‌ పౌరీ గర్వాల్‌లోని పోలింగ్‌ బూత్‌తో కొత్తగా పెళ్లయిన జంట ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తుచేసారు.

హమద్‌ది ఫస్ట్‌ ప్లేస్‌

ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. 2024 ఏడాదికిగాను ఈ ఘనత దక్కించుకుంది. సింగపూర్‌ ఛాంగి రెండో స్ధానంలో నిల్చింది. స్టార్‌ రేటింగ్‌తో స్కైట్రాక్స్‌ ఏటా విడుదల చేసే ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్ర యాలు 36,59,61 స్ధానాల్లో నిలిచాయి.

రోహిత్‌ పెదవి విరుపు

గత ఏడాది ఐపీఎల్‌లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానంపై టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పెదవి విరిచాడు. ఈ విధానం వల్ల ఆల్‌రౌండర్లకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డాడు. భారత్‌ ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు ఇది మైనస్‌ అన్నాడు. ఆల్‌రౌండర్లకు బౌలింగ్‌ చేసి అవకాశం రావడంలే దన్నారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన తాక్ష్వి వాఘాని 25 మీటర్లకు అత్యల్ప లింబో స్కేటింగ్‌ ఛాలెంజ్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ధృవీకరించింది. ఆరేళ్ల చిన్నారి సాధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ కాగా తాక్ష్వి ఘనతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి . 

Latest Articles

రేవంత్ కు ఊహించని షాక్ …. రాజీనామా చేస్తా – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

   తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో హస్తం పార్టీలో ముసలం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక తో ఎమ్మెల్సీ జీవన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్