డాక్టరెట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డాక్టరెట్ అందుకున్నారు. వేల్స్ యూనివర్సిటీలో జరిగినటువంటి స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా డాక్టరేట్ అందుకున్నారు. తన పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపించి డాక్టరేట్ అందించిన వేల్స్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు మెగాపవర్ స్టార్. దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఎంతో అద్భుతంగా రన్ అవుతున్న యూనివర్సిటీ నుంచి తనకు ఈ విధమైనటువంటి గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముందుగా రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ పుత్రోత్సాత్వంతో ట్వీట్ చేసారు.” ఎంతో ప్రసిద్ధిగాంచిన విద్యాసంస్థ వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడం.. ఒక తండ్రిగా ఈ విషయం నన్ను ఎమోషనల్ గా.. గర్వించేలా చేస్తుంది. ఇది ఎంతో విలువైన క్షణం. పిల్లలు తల్లిదండ్రుల విజయా లను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో తన కెరీర్ లో ముందుకు అడుగు వేస్తూ.. పైకి ఎదుగుతున్నాడు. లవ్ యూ మై డియర్ డా.రామ్ చరణ్”అంటూ ట్వీట్ చేసారు.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్