వరంగల్ లో వర్గ పోరు

           వరంగల్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా వర్గపోరు బయటపడింది. పరకాలలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమావేశంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి, కడియం శ్రీహరి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి, కొండా వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కొండా వర్గాన్ని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జై కొండా అంటూ నినాదాలు చేశారు. కొండా వర్గానికి చెందిన ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణును పార్టీకి సమావేశాలకు పిలవడం లేదం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా పరస్పరంగా తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు గజ్జి విష్ణు అదుపులోకి తీసుకున్నారు. గజ్జి విష్ణు అరెస్టును ఖండిస్తూ పర కాల ప్రధాన రహదారిపై గజ్జి విష్ణు అనుచరులు ధర్నా చేశారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్