టికెట్ల కేటాయింపుల్లో సెంట్రల్ కాంగ్రెస్ మల్లగుల్లాలు

  తెలంగాణ కాంగ్రెస్ ఇంకా ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేకపోతోంది..? మూడు స్థానాల్లో హస్తం నేతలకు అభ్యర్థులు కరువయ్యారా..? సామాజిక సర్దుబాటు కోసమే ఆచితూచి అడుగులు వేస్తోందా…? ఇంతకీ పెండింగ్‌లో పెట్టిన మూడు స్థానాలపై కాంగ్రెస్ వ్యూహం ఏంటి…?

  తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడితే…కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వెతుకులాటలతోనే సతమతమవుతోంది. ఇప్పటికే 14 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇంకో మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మూడు స్థానాల్లో హైదరాబాద్ స్థానాని కి అభ్యర్థిని ప్రకటించడానికి పెద్ద ఇబ్బంది లేకపోయినా మిగతా రెండు స్థానాలపై కాంగ్రెస్ హైక మాండ్ తర్జనభర్జన పడుతోంది. ఖమ్మం, కరీంనగర్ సెగ్మెంట్లలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనే విషయంలో హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.

  హైదరాబాద్ నుండి మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. హైదరాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ అలీ మస్కటి పేరును పరిశీలిస్తోంది. బీజేపీ తరఫున మహిళా నేత బరిలో ఉన్న కారణంగా మైనార్టీ మహిళా నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ తుబ్సుం పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోంది. కానీ, ఇప్పటికీ ఎటు తేల్చుకోలేకపోతోంది.

  పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలు కాకముందే కాంగ్రెస్‌లో ఖమ్మం సీటు ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మినహా మిగతా అన్ని అసెంబ్లీలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి కాబట్టి…అక్కడ ఎవరు బరిలో ఉన్నా గెలుపు కాంగ్రెస్‌దేనని అన్ని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్‌కి అక్కడ ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా మారింది. ఇక అక్కడ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి పొంగులేటి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. తన సతీమణి నందినికి టికెట్ కేటాయించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి హైకమాండ్‌కి విన్నవించినట్టు తెలుస్తోంది. మరో మంత్రి తుమ్మల సైతం తమ కుమారుడు యుగేందర్‌కి ఖమ్మం సీటు ఇవ్వమని కోరారు. సీనియర్ నేత వీహెచ్, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం ఖమ్మం టికెట్ కోసం అధిష్ఠానాన్ని కలిశారు. ఇక పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేరు, తమ్ముడు ప్రసాద్‌రెడ్డి పేరు కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్ప టికే రెడ్డి సామాజిక వర్గానికి ఆరు టికెట్లు ఇవ్వడంతో ఖమ్మం స్థానాన్ని కమ్మ లేదా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.

  కరీంనగర్ పార్లమెంట్ విషయంలో సైతం కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కరీంనగర్ నుండి పోటీ చేయాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని అధిష్ఠానం కోరగా జీవన్‌రెడ్డి మాత్రం తాను నిజామాబాద్ నుండి పోటీ చేస్తానని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్‌లో పడింది. ఇక ఆ స్థానం నుండి పోటీ కోసం ప్రవీణ్‌రెడ్డి, వెల్చాల రాజేందర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రెడ్లకి ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చామని, కరీంనగర్‌లో వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీలో కొందరు అభిప్రాయపడు తున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇక ఆ పార్లమెంట్ పరిధిలోని మంత్రులు సైతం టికెట్ ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పడంతో …కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈనెల 13న సీఈసీ మీటింగ్‌లో పెండింగ్‌లో ఉన్న మూడు స్థానాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ మూడు స్థానాలు ఒకదానిపై ఒకటి ముడిపడి ఉన్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల సర్దుబాటులో ఎవరికి టికెట్ గల్లంతు అవుతోంది..ఎవరు గట్టెక్కుతారో చూడాలి.

Latest Articles

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం.!

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్‌లో అంతర్గత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్